KMR: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల నుంచి మొత్తం 135 దరఖాస్తులు అందినట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ప్రజలు విన్నవించిన సమస్యలపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, ఆయా దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.