GDWL: కేటీదొడ్డి మండలంలోని పాగుంట వెంకటాపురంలో వెలసిన శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మంగళవారం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దర్శించుకున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎమ్మెల్యే తన సతీమణి, కుమారుడితో కలిసి ఆలయానికి రాగా, అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు చేసిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు.