MHBD: బయ్యారం మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో గత కొద్ది రోజులుగా వీధి దీపాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని నూతన సర్పంచ్ గుగులోత్ శాంతి కిషన్‌కు, ప్రజలు తెలుపగా.. సర్పంచ్ వెంటనే స్పందించారు. ఇవాళ గ్రామంలోని వాడవాడకు నూతన విద్యుత్ లైట్లను పెట్టించారు. ప్రజా సేవే ధ్యేయమని, ప్రజల మన్ననలతో ముందుకు సాగుతామని సర్పంచ్ పేర్కొన్నారు.