RR: శంషాబాద్‌లోని RBనగర్‌కు చెందిన పల్లెమోని సురేందర్, కవిత దంపతులు చిట్టీల పేరుతో సుమారు రూ.3 కోట్లు మోసం చేసినట్లు పోలీసులు తెలిపారు. 20 ఏళ్లుగా వీరు చిట్టీలు నిర్వహిస్తున్న వీరి వద్ద సుమారు 150 మంది రూ. 50వేల నుంచి రూ. 5 లక్షల వరకు చిట్టీలు వేశారు. చిట్టీలు పూర్తయిన వారికి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసారు.