ATP: గుత్తిలో ‘స్వచ్ఛతా హి సేవ’ కార్యక్రమంలో భాగంగా బుధవారం పలు వార్డుల్లో ప్రజలకు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన ర్యాలీ కల్పించారు. మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలు తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబరు 2వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.