భారత స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో సత్తా చాటాడు. జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్న ఈ పోటీల్లో నీరజ్ ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించాడు. క్వాలిఫికేషన్ రౌండ్లో అతడు 84.85 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నేరుగా ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాడు. ఈ పోటీల ఫైనల్స్ రేపు జరగనున్నాయి.