KMR: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా జిల్లా అదనపు కలెక్టర్ మధు మోహన్ దత్తత సహాయ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దత్తత ప్రక్రియ, చట్టపరమైన నిబంధనలు, కౌన్సెలింగ్పై పౌరులకు అవగాహన కల్పించడమే ఈ కేంద్రం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. దత్తతలో పారదర్శకత, బాలల సంక్షేమమే లక్ష్యమని అదనపు కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్రక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పాల్గొన్నారు.