NGKL: కొల్లాపూర్ మండలం గోవర్ధనగిరికి చెందిన రాఘవేందర్ గౌడ్ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న అతని బాల్య మిత్రులు (2003-2004 బ్యాచ్) వాట్సాప్ వేదికగా చర్చించుకుని తోచిన ఆర్థిక సహాయం సమకూర్చారు. ఇలా సమకూరిన రూ.1,13,000 మొత్తాన్ని గురువారం అతని కుటుంబ సభ్యులకు అందజేశారు. స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచిన వీరిని పలువురు అభినందించారు.