ఖమ్మం: బోనకల్ మండలంలోని ఆళ్లపాడు గ్రామంలో మంగళవారం రాత్రి బీఆర్ఎస్, ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి మల్లు నందిని విక్రమార్క సమక్షంలో వారికి కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రజా పాలనతో మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అభివృద్ధి పథంలో మధిర నియోజకవర్గం నిలుస్తోందని తెలిపారు.