KMR: ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను విస్తృతంగా ప్రచారం చేయాలని పీసీసీ రాష్ట్ర ప్రచార కమిటీ ఛైర్మన్ మధుయాష్కీ గౌడ్ సూచించారు. మంగళవారం హైదరాబాద్లో KMR జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాసరావు ఆయనను కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఇరువురు చర్చించారు. ఈ నెల 15న KMRలో జరిగే బీసీ సదస్సుకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించాలని సూచించారు