JGL: మెట్ పల్లి మండలం జగ్గసాగర్ గ్రామంలో 276 మంది కూలీలు ఉపాధి హామీ పనులకు అత్యధికంగా హాజరై జిల్లాలో మొదటి స్థానంలో నిలిచింది. ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో 256 మంది కూలీలు హాజరై జిల్లాలో ద్వితీయ స్థానం దక్కించుకుంది. గొల్లపల్లి మండలం చిల్వకోడూరులో 243 మంది కూలీలు హాజరై జిల్లాలో తృతీయ స్థానంలో నిలిచిందని ఉపాధి హామీ అధికారులు ప్రకటించారు.