ASF: ఆసిఫాబాద్ నియోజకవర్గంలోని వివిధ మండలాల సమస్యలకు తక్షణమే పరిష్కార మార్గం చూపాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్ కోరారు. మంగళవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను ఆయన కలిశారు. ఈ మేరకు వివిధ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అనంతరం నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆయనకు వివరించారు. మంత్రి సానుకులంగా స్పందించారన్నారు.