MBNR: పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజు గడువును అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు నేడు తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 జరిమానాతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.