KMR: స్థానిక సంస్థ ఎన్నికల్లో అన్ని స్థానాలను గెలుపొందించి కాంగ్రెస్ పార్టీకి నియోజకవర్గం నుంచి బహుమతి ఇద్దామని జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు అన్నారు. కాంగ్రెస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా ఏలే మల్లికార్జున్ తొలిసారి నియోజకవర్గానికి విచ్చేసిన సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నర్సింగ్ రావు పల్లి సర్కిల్ వద్ద ఘనస్వాగతం పలికారు.