BHPL: జిల్లాలో అంగన్వాడీ ఆయా నుంచి టీచర్ పదోన్నతుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలు నిరాధారమని, అవి వాస్తవ విరుద్ధమని జిల్లా సంక్షేమ అధికారి మల్లేశ్వరి స్పష్టం చేశారు. పదోన్నతులు రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాలు, జీవోలు, జిల్లా సెలెక్షన్ కమిటీ నిబంధనలకు అనుగుణంగా జరిగాయన్నారు. అర్హతలు, సర్టిఫికేట్లు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎంపిక జరిగిందని ఆయన అన్నారు.