ABD: గుడిహత్నూర్ మండల కేంద్రంలో మైనర్ బాలికపై అఘాయిత్యం చేసిన నిందితుడికి కఠినంగా శిక్షపడేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు కుమ్ర ఈశ్వరి బాయి అన్నారు. గురువారం బాధిత కుటుంబాని మహిళా కమిషన్ సభ్యురాలు పరామర్శించారు. ఈ సందర్బంగా బాధిత కుటుంబంతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.