SRD: ప్రజాపాలన విజయోత్సవంలో భాగంగా సంగారెడ్డి పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహం వద్ద అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి 2కే రన్ ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, యువకులు, విద్యార్థులు ఉత్సాహంగా పరిగెత్తారు. కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, ఆర్టీవో రవీంద్రారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ పాల్గొన్నారు.