MDK: మహిళా స్వయం సహాయక సంఘాలకు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి రైతు వేదికలో వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేశారు. ఇందిరమ్మ రాజ్యం పేదలు, రైతుల పక్షపాత ప్రభుత్వమని ఆయన పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సబ్సిడీ వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు.