NGKL: తన జన్మదినాన్ని పురస్కరించుకుని నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ శుక్రవారం హైదరాబాదులోని కర్మన్ ఘాట్ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆంజనేయ స్వామి ఆశీస్సులు ప్రజలపై ఉండాలని కాంక్షించానన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి, సీఎంబి ట్రస్ట్ ఛైర్మన్ డాక్టర్ చిక్కుడు అనురాధ ఉన్నారు.