KMR: సీతారంపల్లి గ్రామంలో అప్పుల బాధతో శనివారం ఆత్మహత్య చేసుకున్న గంగిరెడ్డి స్వామి కుటుంబానికి గ్రామస్థులు ముందుకు వచ్చి రూ.8 వేల ఆర్థిక సాయం అందజేశారు. బాధిత కుటుంబానికి అండగా నిలుస్తూ సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సిద్ధరాములు, ఉపసర్పంచ్ స్వామి, జాలిగాం శ్రీను, పుట్ట శ్రీకాంత్, బైకారి రవి, బైకారి రాజమళ్లవ్వ, పుట్ట రాజు, పుట్ట రమేష్,పాల్గొన్నారు