NGKL: క్రిస్మస్ సందర్భంగా నాగర్కర్నూల్ నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి బుధవారం శుభాకాంక్షలు తెలిపారు. ఏసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని ఆయన అన్నారు. సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, శత్రువుల పట్ల క్షమాగుణం కలిగి ఉండాలన్నారు.