MNCL: బెల్లంపల్లి పట్టణంలో అక్రమ నిర్మాణాన్ని ఇవాళ మున్సిపల్ యంత్రాంగం నిలిపివేశారు. రామ్నగర్ అండర్ బ్రిడ్జి వద్ద అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణం చేపట్టారు. దీంతో పలువురు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన అధికారులు మున్సిపల్ సిబ్బందిని పంపించి నిర్మాణ సామాగ్రిని మున్సిపల్ కార్యాలయానికి తరలించారు.