GDWL: జిల్లాలోని కృష్ణానదిపై డబ్లింగ్ ట్రాక్ నిర్మాణంలో భాగంగా రెండో రైల్వే బ్రిడ్జి పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఆదివారం సెలవు దినమైనప్పటికీ, కాంట్రాక్టర్లు, కార్మికులు పనులను ఏమాత్రం ఆపకుండా కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నది గర్భంలో భారీ యంత్రాలతో పిల్లర్ల కోసం లోతైన గుంతలు తవ్వి, పునాది నిర్మాణ పనులు చేపడుతున్నారు.