ADB: ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబీ కాంప్లెక్స్‌లో ఉన్న స్పోర్ట్స్ స్కూల్‌ను ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ ఆకస్మికంగా సందర్శించారు. మంగళవారం ఉదయం ఆయన స్పోర్ట్స్ స్కూల్‌ను సందర్శించి కిచెన్ రూమ్ పరిశీలించి ఆహార సామాగ్రిని పరిశీలించారు. విద్యార్థులకు అందించే ఆహారంలో నాణ్యత తప్పనిసరిగా పాటించాలన్నారు. మెనూ ప్రకారమే తప్పకుండా టిఫిన్స్ పెట్టాలన్నారు.