HYD: బల్కంపేట రేణుక ఎల్లమ్మ ఆలయంలో మంగళవారం పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే అర్చకులు శాస్త్రోక్తంగా అభిషేకాలు పూర్తి చేసి, సుగంధ పుష్పాలతో తల్లిని శోభాయమానంగా అలంకరించారు. భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. భక్తుల నామస్మరణతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మికతతో మార్మోగుతోంది.