ADB: రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా మావల, ఆదిలాబాద్ రూరల్, తాంసి మండలాల పరిధిలోని మావల,జందాపూర్, గొట్కూరి, పిప్పల్కోటి, కప్పర్ల, తాంసి పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. క్యూలైన్ పాటించాలని, సెల్ ఫోన్లు, పెన్నులు, వాటర్ బాటిల్స్, ఇంకు బాటిల్స్ వంటి వాటికి అనుమతి లేదని, అనవసరంగా గుంపులుగా ఉండొద్దని సిబ్బందికి సూచించారు.