KMR: గడిచిన 24 గంటల్లో కామారెడ్డి జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా అత్యధికంగా కురిసిన వర్షపాతం వివరాలు.. నిజాంసాగర్ మండలంలోని హాసన్ పల్లి 21.5 మి.మీ, లింగంపేట్ 11.5, పిట్లంలో 7.5, నాగిరెడ్డిపేట్లో 3.0 , మగ్గంపూర్ 2.0, జుక్కల్, పెద్ద కొడపగల్, పాత రాజంపేట్లో 0.8, పుల్కల్లో 0.5 మి.మీ వర్షపాతం నమోదు అయింది.