NZB: ధర్పల్లి మండలంలో గురు పౌర్ణమిని పురస్కరించుకొని గురువారం దత్త జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గురు దత్త ఆశ్రమంలో తొమ్మిది రోజులపాటు గురు చరిత్ర పారాయణం అనంతరం, పౌర్ణమి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు, యజ్ఞం, అన్నదానం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ నిర్వాహకులు శంకర్, బుచ్చన్న, గంగాధర్ స్వామి పాల్గొన్నారు.