NLG: మేడ్చల్ జిల్లా కీసర మండలం దమ్మాయిగూడలో అంబేద్కర్ విగ్రహాన్ని దూషిస్తూ హేళన చేస్తూ వీడియో తీసి వాట్సాప్లో పెట్టిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా సమత సైనిక్ దళ్ ఆధ్వర్యంలో బుధవారం కొండమల్లేపల్లి ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గ కన్వీనర్ జిల్లా రాములు మాట్లాడుతూ.. అంబేద్కర్ అవమానించిన వ్యక్తిపై రాజద్రోహం కేసు పెట్టాలన్నారు.