వేములవాడ ఏఎస్పీగా కొట్టే రుత్విక్ సాయి నియమితులయ్యారు. 2023 IPS బ్యాచ్‌కు చెందిన రుత్విక్ సాయి ఇప్పటివరకు గ్రేహౌండ్స్ విభాగం ఏఎస్పీగా పనిచేశారు. తాజా బదిలీలలో భాగంగా ఆయనను వేములవాడ ఏఎస్పీగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇక్కడ అదనపు ఎస్పీగా పని చేస్తున్న శేషాద్రిని రెడ్డిని జగిత్యాల అదనపు ఎస్పీ (అడ్మిన్)గా నియమించారు.