MHBD: సీపీఎం పార్టీ తొర్రూరు మండల కమిటీ ఆధ్వర్యంలో ఇళ్లు లేని నిరుపేద మహిళలతో కలిసి శుక్రవారం సావిత్రిబాయి పూలే విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి యాకూబ్ మాట్లాడుతూ.. గత ఆరు నెలలకు పైగా నిరసనలు తెలుపుతున్నా స్థానిక ఎమ్మెల్యే స్పందించడం లేదని, ఇకనైనా ఎమ్మెల్యే స్పందించి మహిళలకు ఇళ్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.