MDCL: లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఓ చిన్నారి నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ఘటన మేడిపల్లి PS పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు.. చెంగిచెర్ల నందిని నగర్‌లోని శ్రీ బాలాజీ వెయిట్ బ్రిడ్జిలో దుర్గం వెంకటేశ్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. అక్కడ ఆడుకుంటున్న అతడి కుమారుడు సాయి వేదాంశ(21/2)ను ఆదివారం లారీ డ్రైవర్ ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఆ బాలుడు మృతి చెెందాడు.