KMR: గూడెం గ్రామంలోని KKS ఇటుక బట్టిని బుధవారం సాయంత్రం అధికారులు పరిశీలించారు. ఫిర్యాదు ఆధారంగా తహశీల్దార్, కార్మిక శాఖ, పోలీస్ శాఖ, బాలల సంక్షేమ శాఖ అధికారులు సంయుక్తంగా తనిఖీ చేసి ఒడిశాకు చెందిన 12 వలస కార్మికులను గుర్తించారు. వారి ఫిర్యాదుపై యజమానిని విచారించగా స్వగ్రామాలకు పంపేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.