మేడ్చల్: జిల్లాలోని పీర్జాదిగూడ పరిధిలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. పోలీసు బందోబస్తు మధ్య ఆక్రమణలను తొలగించారు. తెల్లవారుజాము నుంచి హైడ్రా ఈ కూల్చివేతలు చేపట్టింది. పీర్జాదిగూడ, బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లపై హైడ్రా అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ఇక్కడి రహదారులు, ప్రభుత్వ స్థలాలను కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టిన్నారు.