NLG: నకిరేకల్ నియోజకవర్గ కేంద్రం నుంచి శనివారం హైదరాబాద్లో నిర్వహించే మేధావుల సంఘీభావ సభకు నకిరేకల్ డివిజన్ మాదిగ ఉద్యోగుల సమైక్య నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ బొజ్జ వేణుగోపాల్, జిల్లా ఉపాధ్యక్షులు వెంకటనారాయణ మాట్లాడుతూ.. SC వర్గీకరణను చేపట్టే వరకు పోరాటం చేస్తామన్నారు.