BDK: పాల్వంచ మండలంలోని మర్రేడు వాగు నుంచి కొందరు అక్రమార్కులు ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారని స్థానికులు చెప్పారు. పగలు రాత్రి తేడా లేకుండా మితిమీరిన వేగంతో పదుల సంఖ్యల ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పారు. అధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు.