NLG: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ కార్మికులకు హామీ ఇచ్చిన రూ.12 వేల ‘ఆత్మీయ భరోసా’ను వెంటనే అమలు చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారి ఐలయ్య డిమాండ్ చేశారు. ఇవాళ చిట్యాల మండలం గుండ్రాంపల్లిలో ఉపాధి హామీ పనులను కత్తుల లింగస్వామితో కలిసి పరిశీలించారు. రెండేళ్లవుతున్నా కాంగ్రెస్ హామీ నెరవేర్చలేదని విమర్శించారు.