NRPT: డయల్ యువర్ డిఎం కార్యక్రమం రేపు నిర్వహిస్తున్నట్లు డిపో మేనేజర్ లావణ్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కోస్గి, నారాయణపేట డిపో పరిధిలోని ప్రయాణికులు ఫోన్ ద్వారా సమస్యలు, సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు 7382826293 నంబర్‌కు ఫోన్ చేసి చెప్పాలని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.