KMR: రామారెడ్డి మండలంలోని మద్దికుంట మండల పరిషత్ పాఠశాలలో ప్రభుత్వ ఆదేశానుసారం ఫ్రీ ప్రైమరీ (యల్కేజీ)ని మండల విద్యాశాఖ అధికారి ఆనంద్ రావు ప్రారంభించారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలో ప్రీ ప్రైవరీ ప్రారంభించడం సంతోషదగ్గ విషయమని, ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు 4 సంవత్సరాలు నిండిన తమ పిల్లలను పాఠశాలకు పంపి వినియోగించుకోవాలని సూచించారు.