BDK: భద్రాచలం వద్ద గోదావరి నది నీటిమట్టం క్రమంగా తగ్గుతూ ఉంది. శనివారం ఉదయం 7 గంటలకు నీటిమట్టం 39.20 అడుగులు వద్ద నమోదైంది. జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదేశాల ప్రకారం వరద పరిస్థితులను సన్నద్ధంగా పర్యవేక్షిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.