VSP: విశాఖ జిల్లా పరిధిలో చేపట్టనున్న విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టు, సాధారణ రైల్వే లైన్ల విస్తరణ, ఇతర పనులకు సంబంధించిన భూసేకరణ ప్రక్రియ, ఇతర పనుల్లో జోరు పెంచాలని సంబంధిత అధికారులను కలెక్టర్ హరేందిర ప్రసాద్ ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ మీటింగు హాలులో జరిగిన సమావేశంలో మెట్రో రైల్ ప్రాజక్టుపై చర్చించారు.