SKLM: ఆమదాలవలస పట్టణం నుంచి కృష్ణాపురం మీదుగా నరసన్నపేట వెళ్లే రోడ్డులో పాత షుగర్ ఫ్యాక్టరీ వద్ద ఉన్న రైల్వే గేటు మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. మరో రెండు రోజుల్లో పనులు పూర్తి చేస్తామని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. రెండు రోజుల పాటు ఈ రోడ్డు నుంచి నరసన్నపేట వైపు వెళ్లేందుకు వాహనాల రాకపోకలు నిలిపివేస్తున్నట్లు వివరించారు.