VSP: సింహాచలంలో స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. నరసింహ స్వామి వారి దేవస్థానం, సింహగిరి పరిసరాల్లో ప్రత్యేక శుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో వేండ్ర త్రినాధరావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా ,సహాయ కార్యనిర్వహణాధికారి కె. తిరుమలేశ్వరరావు, శానిటేషన్ విభాగ సహాయ కార్యనిర్వహణాధికారి పంతం శ్రీనివాస్ ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.