KNR: సీపీఐ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడిగా కరీంనగర్‌కు చెందిన కసిరెడ్డి మణికంఠ రెడ్డి ఎన్నికయ్యారు. మల్కాజిగిరిలో జరిగిన సీపీఐ రాష్ట్ర 4వ మహాసభలలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలు చేసిన మణికంఠ రెడ్డిని ఎన్నుకోవడం పట్ల పార్టీ జిల్లా నాయకులు హర్షం వ్యక్తం చేశారు.