JGL: ఇబ్రహీంపట్నం మండలం ఎర్ధండి గ్రామంలో గోదావరి నది నుంచి వీడీసీ కమిటీ సభ్యులు నిన్న నీటిని తీసుకువచ్చి గ్రామంలోని దేవత విగ్రహాలకు జలాభిషేకం నిర్వహించారు. ప్రతి ఏటా దసరా ముందు రోజు మానాయి పర్వదినం పురష్కరించుకొని గ్రామంలో దేవతలకు జలాభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఇలా చేయడం వల్ల గ్రామంలో పాడి పంటలతో పాటు రోగ బాధలు తోలాగుతాయని విశ్వసిస్తారు.