NRPT: రాష్ట్ర ఫెర్టిలైజర్స్ దుకాణాల అసోసియేషన్ పిలుపు మేరకు మరికల్ మండల కేంద్రంలో సోమవారం ఎరువుల దుకాణాలను సంపూర్ణంగా బంద్ చేశారు. ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న సమస్యల పరిష్కారం కోసం ఈ నిరసన చేపట్టినట్లు అసోసియేషన్ అధ్యక్షుడు ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ బంద్ కార్యక్రమంలో శరత్ బాబు, విష్ణువర్ధన్ రెడ్డి, విద్యాసాగర్, విష్ణు తదితరులు పాల్గొన్నారు.