SRPT: నూతన సంవత్సరం వేడుకలు జాగ్రత్తగా జరపాలని జిల్లా ఎస్పీ నరసింహ సూచించారు. వేడుకల పేరుతో ప్రజా జీవనానికి భంగం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి జిల్లా వ్యాప్తంగా పోలీస్ బందోబస్త్, పెట్రోలింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వడం, టపాసులు, డీజేలు నిషేధమని తెలిపారు.