NLG: పెద్దఅడిశర్లపల్లి మండలంలో ఎమ్మెల్యే బాలునాయక్ బుధవారం పర్యటించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఉ.11.30 గంటలకు అంగడిపేట క్రాస్ రోడ్ వద్ద సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మ.12.30 గంటలకు పీఏపల్లి ఎంపీడీవో కార్యాలయంలో కల్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ, మ.1 గంటకు తిరుమలగిరి గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారని పేర్కొన్నారు.