BHPL: గణేశుని ఆశీస్సులు అందరిపై ఉండాలని భూపాలపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు. స్థానిక ది కాకతీయఖని కోల్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న మహా గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగముగా బుధవారం నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమం నిర్వహించారు. కాగా ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొని గణపతిని దర్శించుకున్నారు.