MDK: జిల్లాలో ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మెదక్ నుంచి 100 బస్సులు, నర్సాపూర్ నుంచి 34 బస్సులు నడుపుతున్నామని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం కోసం 9391942254 నంబర్‌తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.